స్వయంభూ… రారా ధీవర లిరికల్ వీడియో సాంగ్‌

April 17, 2026


img

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ నుంచి ‘రారా ధీవర...’ అంటూ సాగే పవర్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు రవి బస్రూర్ సంగీతం అందించగా సంతోష్ వెంకీ బృందం ఆలపించింది.  

ఈ సినిమాలో నిఖిల్‌కి హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: కెకె సెంథిల్ కుమార్‌,  డైలాగ్స్: విజయ్‌ కామిశెట్టి, స్టంట్స్: కింగ్ సోలమన్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.  

పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ ఏప్రిల్‌ 10న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారాణాల వలన ఈ వేసవిలో విడుదలవుతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష