దాదాపు నాలుగేళ్ళ విరామం తర్వాత ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ ఓ సినిమా చేయబోతోంది. ఆ సినిమా పేరు ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రేమ-గౌరవం-రాజకీయాలు ఈ సినిమా కథ నేపధ్యమని పోస్టర్లోనే చెప్పేశారు. ఈసినిమాకి సంగీతం మణిశర్మ, కెమెరా: ఆర్. మధి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేయబోతున్నారు.
70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.