పెద్ది పహిల్వాన్ ఇప్పుడు కాదు జూన్‌లో వస్తాడట!

April 15, 2026


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న పెద్ది సినిమా వాయిదా పడింది. ఈ నెల 30న ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉండగా జూన్ నెలలో విడుదల చేస్తామని వృద్ధి సినిమాస్ నేడు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జూన్‌లో ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. పెద్ది టాకీ పార్ట్ షూటింగ్‌ పూర్తయిందని ఒక పాట చిత్రీకరణ ఇంకా బాకీ ఉందని తెలిపింది. 

ఇటీవల నిర్మాత ఎస్‌కెఎన్ పెద్ది జూన్ 25కి వాయిదా పడిందనన్నారు. కానీ తర్వాత పొరపాటున నోరు జారానన్నారు. కానీ ఆయన చెప్పింది నిజమేనని ఇప్పుడు తేలింది. కనుక ఆయన చెప్పినట్లుగానే పెద్ది జూన్ 25న విడుదల చేస్తారేమో? 

ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో రామ్‌ చరణ్‌ చేతిలో గద పట్టుకొని కండలు తిరిగిన శరీరంతో ‘పెద్ది పహిల్వాన్‌’గా చూపారు. అది చూసి అభిమానులు సంతోషంతో ఉప్పొంగి పోతుంటే, మరి కొందరు ఇకపై హనుమంతుడి పాత్రకు ఎవరినీ వెతుక్కోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్స్ చేశారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష