నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ సూపర్ హిట్. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ కలిసి ‘మా ఇంటి బంగారం’ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘తస్సాదియ్యా...’ అంటూ సాగే పెళ్ళి పాట విడుదలైంది. రెహ్మాన్ వ్రాసిన ఈ పాటని సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించిన ఈ పాటకు సమంతతో సినిమాలో నటిస్తున్న నటీనటులందరూ డాన్స్ చేశారు. మద్యలో కొరియో గ్రాఫర్ పోనీ వర్మ, దర్శకురాలు నందిని రెడ్డిలు కూడా సందడి చేశారు.
ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.
ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.