తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా, అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో గల మునీరాబాద్ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నారు. దీనిలో సుమారు 35,000 మంది వరకు పాల్గొంటారని ఆమె స్వయంగా చెప్పారు. కనుక దీని కోసం చాలా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కొత్త పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఫోటోలతో భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కనుక వాటి కోసం కల్వకుంట్ల కవిత ఫోటో షూట్ చేయించుకున్నారు.
దానిలో ఆమె నీలం బోర్డర్ కలిగిన ఎరుపు చీర, నీలం రంగు జాకెట్ ధరించారు. మరొక ఫోటో కోసం పూర్తి ఎరుపు రంగు చీర, జాకెట్ ధరించారు. మరొక ఫోటో కోసం పచ్చరంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించారు. వాటిలో రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నఫోటో ఒకటి. నడుస్తున్నట్లు తీసిన ఫోటోలు రెండు. చేతులు కట్టుకొని సైడ్ ఫోజులో మరొక ఫోటో దిగారు.