బిహార్‌ని పాలించబోయే సమ్రాట్ విద్యార్హత ఏమిటో తెలుసా?

April 15, 2026


img

బిహార్‌ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి నేడో రేపో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కనుక బిహార్‌కు దశ, దిశ నిర్దేశించబోయే ఆయన గురించి తెలుసుకోవడం అవసరమే. ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు...  

మీడియా ప్రతినిధి ప్రశ్న: మీరు మీ ఎన్నికల అఫిడవిట్‌లో ఏడవ తరగతి పాస్ అయినట్లు పేర్కొన్నారు. అంటే కనీసం పదో తరగతి వరకు కూడా చదవుకోలేదా? పదో తరగతి పాస్ అయ్యారా లేదా? 

సమ్రాట్ జవాను: ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా లేదా ఎవరి తరపునైన అడుగుతున్నారా? 

మీడియా ప్రతినిధి: ఇది మీ రాజకీయ ప్రత్యర్ధి ప్రశాంత్ కిషోర్ అడిగిన ప్రశ్న.  

సమ్రాట్: ఇలా ఎవరుపడితే వారు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎన్నికల ‘హఫిడవిట్‌’లో నేను చాలా స్పష్టంగా నా విద్యార్హతలు గురించి పేర్కొన్నాను. నేను మదురై కామరాజ్ యూనివర్సిటీలో పిఎఫ్‌సి కోర్సు చేశాను. 

మీడియా ప్రతినిధి: పిఎఫ్‌సి కోర్సు అంటే ఏమిటి? 

సామ్రాట్: ప్రీ-ఫౌండేషన్ కోర్స్. 

మీడియా ప్రతినిధి: దేనికి ప్రీ-ఫౌండేషన్?

సామ్రాట్: ఆ వివరాలు యూనివర్సిటీకి ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి.  

పలు యూనివర్సిటీలు దూరవిద్యా విధానంలో బీఏ, బీకామ్‌ తదితర కోర్సులలో చేరేవారికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టినట్లే,   పదో తరగతి కూడా పాస్ అవని వారి కోసం మదురై కామరాజ్ యూనివర్సిటీ ఈ ప్రీ-ఫౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష పెట్టి దానిలో ఉత్తీర్ణులైనవారికి పదో తరగతి చదివేందుకు శిక్షణ ఇస్తుంది. 

ఆ కోర్సే చేశానని సమ్రాట్ చౌదరి చెప్పుకుంటున్నారు. కనుక అలాంటి బలమైన ఫౌండేషన్ కలిగిన ఆయన పాలనలో బిహార్‌ విద్యారంగం తప్పకుండా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం!      


Related Post