లెనిన్ నుంచి ఎట్టా ఎట్టా... లిరికల్ నేడే

April 16, 2026


img

అక్కినేని అఖిల్ అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘లెనిన్’ జూన్ 26వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి ఎట్టా ఎట్టా... అంటూ సాగే డ్యూయెట్ సాంగ్‌ ఈరోజు సాయంత్రం 4.05 గంటలకి విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ హీరో, హీరోయిన్ల పోస్టర్ వేశారు. దాంతో పాటు పూర్తి ఆడియో సాంగ్‌ విడుదల చేశారు. 

భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటకి తమన్ సంగీతం అందించారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్‌, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 26వ తేదీన లెనిన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 


Related Post

సినిమా స‌మీక్ష