కృష్ణావతారం-1 ట్రైలర్‌ చూశారా?

April 16, 2026


img

పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడు... ఆయన అవతారం, అయన లీలలు, మహిమలు, కురుక్షేత్ర మహా సంగ్రామం, దానిలో ఆయన భోదించిన భగవద్గీతని కథాంశంగా చేసుకొని ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు. తాజాగా పూర్ణ పురుషుడు.. కృష్ణావతారం పేరుతో రెండు భాగాలుగా మరో సినిమా వస్తోంది. 

హార్దిక్ గజ్జర్ దర్శకత్వంలో సిద్దార్ధ గుప్త శ్రీకృష్ణుడుగా, సుష్మిత భట్ రాధగా, సంస్కృతి జయన సత్యభామగా, నివాషియ్ని కృష్ణన్ రుక్మిణిగా నటించిన కృష్ణావతారం-1 హృదయాలయం ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ ప్రకారం మొదటి భాగంలో శ్రీకృష్ణుడు-రాధల ప్రేమ నేపధ్యంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం వరకు జరిగిన ఘట్టాలను దర్శకుడు మరో కొత్త కోణంలో ఆవిష్కరించారు. ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కనుక సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆశించవచ్చు. 

ఈ సినిమాకు దర్శకత్వం: హార్దిక్ గజ్జర్, స్క్రీన్ ప్లే: హార్దిక్ గజ్జర్, ప్రకాష్ కపాడియా, రామ్‌ మూరి, సంగీతం: ప్రసాద్ ఎస్, కెమెరా: ఆయంకా బోస్ చేశారు. 

క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ ఎంటర్‌టైన్మెంట్స్‌ సమర్పణలో అథ శ్రీకథ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాజన్ రాజ్ కురుప్, శోభ సంత్ కలిసినిర్మించిన కృష్ణావతారం మొదటి భాగం మే 7న పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/MJ60w-BRuv0?si=EIyyJygY9p001Inc" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష