రావు బహదూర్ నుంచి ఓ సుందరి లిరికల్

April 16, 2026


img

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ చేస్తున్న ‘రావు బహదూర్ నుంచి ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. రెహ్మాన్ వ్రాసిన ఈ పాటని స్మరణ్‌ సాయి స్వర పరిచి సంగీతం అందించగా ప్రముఖ నేపధ్య గాయకుడు కేజే ఏసుదాస్‌ మధురమైన స్వరాన్ని మరోసారి గుర్తుచేస్తూ ఆయన కుమారుడు విజయ్‌ ఏసు దాస్ అద్భుతంగా ఆలపించారు.     

ఈ సినిమాలో సత్యదేవ్ వృద్ధుడైన ‘రావు బహదూర్’గా నటిస్తున్నారు. రావు బహదూర్ వేషంలో సత్యదేవ్‌ని గుర్తుపట్టడం కూడా కష్టమే. మేకప్ అంత అద్భుతంగా ఉంది. వికాస్ ముప్పల, దీప థామస్, బాలీవుడ్‌ పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్‌ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినినిమాకు కథ, దర్శకత్వం, ఎడిటింగ్: వెంకటేష్‌ మహా, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కార్తీక పర్మర్, కోరియోగ్రఫీ: శ్రావణ్ ముప్పిరి చేస్తున్నారు.   

ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహాయాన బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్న ‘రావు బహదూర్’ ఈ వేసవిలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష