దుబాయ్‌లో తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్

April 17, 2026
img

బస్సులు, కార్లు, రైళ్ళు, బుల్లెట్ రైళ్ళు, విమానాలను చూశాం. ఇకపై ఎయిర్ టాక్సీలు చూడబోతున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా విరివిగా డ్రోన్లు వాడుతున్నాము. వాటికి భారీ రూపమే ఈ ఎయిర్ టాక్సీలు. అంటే వీటిని మనుషులు ప్రయాణించగల పెద్ద డ్రోన్లని అనుకోవచ్చు. 

భారత్‌లో బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌ నగరాలలో వీటిని తయారు చేసి పరీక్షిస్తున్నారు. కానీ దుబాయ్‌లో ఇప్పటికే ప్రయోగాలు విజయవంతం అవడంతో ఎయిర్ టాక్సీ స్టేషన్ కూడా సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం. 

దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో సుమారు 3,100 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్ టాక్సీ స్టేషన్ని యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ పరిశీలించారు. 

ఈ ఏడాది చివరి నాటికి ఇక్కడి నుంచి ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభిస్తామని ట్వీట్‌ చేశారు. ఏడాదికి సుమారు లక్షన్నరకు పైగా ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా ఈ స్టేషన్ నిర్మించామని చెప్పారు. 

ఈ ఎయిర్ టాక్సీలు కూడా హెలికాఫ్టర్ల మాదిరిగానే గాల్లోకి లేస్తాయి. దిగుతాయి. కనుక వీటికి రన్ వే అవసరం ఉండదు. అందువల్ల ఈ ఎయిర్ టాక్సీ స్టేషన్లో రెండు ల్యాండింగ్ ప్యాడ్స్, చార్జింగ్ స్టేషన్స్, వీటి ద్వారా ప్రయాణించేవారి కోసం రెండంతస్తుల కార్ పార్కింగ్, గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు విమానాల రాకపోకలకు ఆటంకం లేకుండా అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్ వ్యవస్థ వగైరా ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఈ ఎయిర్ టాక్సీ సేవలను నిర్వహణ బాధ్యతని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్త్మరియు స్కై పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిసి నిర్వహిస్తాయి.            

Related Post