రామలక్ష్మణులు వలస కూలీలు: ప్రకాష్ రాజ్

April 17, 2026


img

ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటుడనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. ఆయన కర్ణాటకకు చెందినవారైనప్పటికీ దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులందరూ తమ రాష్ట్రానికి చెందిన వారనే భావిస్తుంటారు. ఆయనంటే అందరికీ అంత అభిమానం. కానీ తాను హిందూ మతం, హిందూ దేవుళ్ళ గురించి చేసే అనుచిత వ్యాఖ్యలు చాలా మందిని బాధిస్తాయని గ్రహించక పోవడం చాలా బాధాకరం.   

తాజాగా ఆయన కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్నప్పుడు రామ లక్ష్మణులిద్దరూ ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలని, వారు దక్షిణాదికి చెందిన రావణుడి తోటలో పండ్లు దొంగిలించినప్పుడు శూర్పణక చూసి  జీఎస్టీతో కలిపి రెండువేల డాలర్లు చెల్లించాలని అడిగిందని, కానీ వారు నిరాకరించడంతో రామ-రావణ యుద్ధం జరిగిందని ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా అన్నారు. 

ప్రకాష్ రాజ్ బిజేపి హిందుత్వ విధానాన్ని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ప్రధాని మోడీ దేశాన్ని నిలువునా చీల్చేస్తున్నారని, ప్రజల మద్య బిజేపి మత చిచ్చు పెడుతోందని ఆయన  అభిప్రాయం కనుక ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని మోడీని, బిజేపిని నిలదీస్తుంటారు.

ఆ కోణంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అర్ధమవుతోంది. కానీ కోట్లాది మంది ఆరాధించే శ్రీరామలక్ష్మణుల గురించి అయన ఇంత చులకనగా మాట్లాడటంపై నెటిజన్స్, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Related Post