హోర్మూజ్‌పై అమెరికా-ఇరాన్‌ దాగుడుమూతలు

April 18, 2026


img

ఇరాన్‌ని తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగిన ట్రంప్‌ ఇప్పుడు యుద్ధం కొనసాగించలేక, ముగించలేకపోతున్నారు. కనుక దీని నుంచి గౌరవప్రదంగా బయపడేందుకు ప్రయత్నించాలి. పాక్‌ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో జరిగిన జరిగిన శాంతి చర్చల ద్వారా ఆయనకు ఆ మార్గం కనిపించింది. 

కానీ శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌ మీద భీకర దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడం, ఇరాన్‌ సార్వభౌమత్వానికి భంగం కలిగించే షరతులు విధించడం వల్ల ఆ చర్చలు విఫలమయ్యాయి. 

కనుక మళ్ళీ యుద్ధం తప్పదనుకుంటే ట్రంప్‌ రూట్ మార్చి హోర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నారు. 

ఓ పక్క త్వరలో రెండో దఫా శాంతి చర్చలు జరుగాబోతున్నాయని, త్వరలో యుద్ధం ముగిసి జలసంధి శాశ్వితంగా తెరుచుకోబోతోందని చెపుతూనే నౌకలను అడ్డుకోవడంపై ఇరాన్‌ మండి పడింది. 

కనుక ఇరాన్‌ కూడా ఎత్తుకు పైఎత్తు వేస్తూ జలసంధిని శాశ్వితంగా తెరుస్తున్నట్లు ప్రకటించి తెరిచింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే అనేక నౌకలు దాని గుండా రాకపోకలకు సిద్దమయ్యాయి. 

కానీ ఇరాన్‌ ఊహించినట్లే అమెరికా యుద్ధ నౌకలు వాటిని అడ్డుకున్నాయి. ఇంతకాలం చమురు రవాణాకు ఇరాన్‌ సహకరించడం లేదని వాదిస్తున్న ట్రంప్‌ని ప్రపంచ దేశాల దృష్టిలో దోషిగా నిలబెట్టడమే ఇరాన్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

తాము శాంతి చర్చలకు సిద్దమని చెపుతూ జలసంధిని తెరిచినా ట్రంప్‌ అడ్డుపడుతూ చర్చలకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇరాన్‌ మళ్ళీ జలసంధిని మూసేసింది. 

కనుక అమెరికా-ఇరాన్‌ మద్య ఈ హోర్మూజ్ దాగుడు మూతల ఆటలు ఇప్పట్లో ఆగేలా లేవనిపిస్తుంది.  



Related Post