ఛలో మేడిగడ్డ: బీఆర్ఎస్‌ పార్టీ

April 19, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేపటి జగిత్యాల సభకు ఆ పార్టీ నేతలు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేతలు మేడిగడ్డకు వెళ్ళి బ్యారేజ్‌లో క్రుంగిపోయిన పియర్స్ పరిశీలించారు. అనంతఃరం సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు. కానీ ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్‌కి మరమత్తులు చేయించలేదు. రెండున్నరేళ్ళుగా రైతులకు నీళ్ళు అందకుండా చేస్తున్నారు. మరమత్తులు చేయించడం లేదు కానీ త్వరలో సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్‌ పరిశీలనకు వస్తారట! దేనికి? గత ఏడాది నల్గొండలో బీఆర్ఎస్‌ పార్టీ ప్లీనరీ సభ జరిగినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్‌కి వచ్చి మా అధినేత కేసీఆర్‌, మా బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

రేపు (సోమవారం) జగిత్యాలలో కేసీఆర్‌ అధ్యక్షతన బహిరంగ సభ జరుగబోతోంది. కనుక మళ్ళీ మాపై బురద జల్లెందుకే సిఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్‌ పర్యటనకు బయలుదేరుతున్నారా? అయన పర్యటన అంతర్యం ఏమిటో చెప్పాలి. ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకొని ఇప్పటికైనా మేడిగడ్డ బ్యారేజ్‌కి మరమత్తులు చేయించి రైతులకు నీళ్ళు అందించాలి,” అని అన్నారు. 


Related Post