హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఓ యానిమేషన్ సినిమా అంత గొప్పగా తీయవచ్చని, తీసి హిట్ కొట్టవచ్చని ఆ సినిమాతో హోంబలే ఫిల్మ్స్ నిరూపించి చూపింది.
దశావతారాలలో ఆరు అవతారాలను ‘మహావతార్ సిరీస్’లో సినిమాలుగా తీసి రాబోయే 12 ఏళ్ళలో విడుదల చేస్తామని హోంబలే ఫిల్మ్స్ ఇదివరకే ప్రకటించింది. .
మహావతార్ నరసింహ దర్శక నిర్మాతలతో కలిసి మరో యానిమేషన్ సినిమా సిద్ధం చేసింది. మహావతార్ ప్రకటిస్తూ నేడు ఓ వీడియో విడుదల చేసింది. దానిలో కూడా
హిరణ్య కశిపుడు, భక్త ప్రహ్లాదుడు, నరసింహావతారం చూపిస్తూ మరో అవతారం గురించి రేపు ఉదయం 11.22 గంటలకు టైటిల్ ప్రకటిస్తామని హోంబలే ఫిల్మ్స్ తెలియజేసింది.
‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించగా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలోనిర్మించిన ఈ సినిమాకి కధ: జయపూర్ణ దాస్, రుద్ర పి గోష్, అదనపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రుద్ర పి గోష్, సంగీతం: శామ్ సి, ఎడిటింగ్: అజయ్ ప్రశాంత్ వర్మ, అశ్విన్ కుమార్, పాటలు: ది శ్లోక, సౌరభ్ మిట్టల్, ట్వింకిల్ చేశారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, చైతన్య దేశాయ్ ఎస్సీ ధావన్, దుర్గా బాలుజా కలిసి మహావతార్ నిర్మించారు. బహుష్ పూర్తిగా ఇదే టీమ్‌తో ఇప్పుడు మరో అవతారం చూపించబోతోంది.