గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా ‘టాక్సిక్’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్) ఏకంగా ఐదుగురు హీరోయిన్లున్నారు. నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కనుక అభిమానులు వారితో పాటల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 2న టాక్సిక్ మొదటి పాట విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
టాక్సిక్‌కి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు.