ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన రాజస్థాన్‌లో పెళ్ళి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. వారి పెళ్ళి వేడుకలో వారిరువురూ ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి, రాజావారు-రాణీవారు స్టైల్లో ఫోటోలు దిగారు. వారిద్దరూ మళ్ళీ చాలా కాలం తర్వాత ‘రణబాలి’ సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
కనుక వారి పెళ్ళి సందర్భంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కూడా ఓ పోస్టర్ విడుదల చేశారు. పాతాకాలపు రాజ దంపతులు ఫోటోలు ఏవిధంగా ఉంటాయో అచ్చం అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక కూర్చున పోస్టర్ విడుదల చేశారు.
దానిలో విజయ్ దేవరకొండ చాలా గంభీరంగా చూస్తుంటే, రష్మిక అమాయకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు రణబాలి, రష్మిక పాత్ర పేరు జయమ్మ.
బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీనిలో ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటించబోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న రణబాలి విడుదల కాబోతోంది.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు.

Navadampatulu ❤️

Perfectly detailed super song promo with an excellent performance.#Ranabaali #VijayDeverakonda#RashmikaMandannapic.twitter.com/INeizeAcLb
— Milagro Movies (@MilagroMovies) February 28, 2026