చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ శుక్రవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆలయానికి వెనుక వైపున్న గోశాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఆయన మృతికి సంతాపంగా రెండు రోజులు ఆలయం మూసివేయబోతున్నట్లు సమాచారం.
చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ వ్యవస్తకులు డా.సౌందర్ రాజన్ అంతకు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం రిజిస్ట్రార్‌గా కూడా పనిచేశారు.