ఇంతమంది మనసులు గెలుచుకున్నారా... సౌందర్ రాజన్!

February 28, 2026
img

చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం గురించి చెప్పుకున్నప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ పేరు కూడా ప్రస్తావిస్తుంతారు. అంతగా అయన ఆ ఆలయంతో అనుబందం పెనవేసుకున్నారు. గత కొంత కాలంగా వృదాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సౌందర్ రాజన్ శుక్రవారం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 

సౌందర రాజన్ మృతి పట్ల రాష్ట్రాలు, పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, “ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా సౌందర్ రాజన్ ఎంతో మంచి పేరు గడించారు. ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. సౌందర రాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను,” అని ట్వీట్‌ చేశారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, పలువురు కాంగ్రెస్‌, బిజేపి, బీఆర్ఎస్‌ నేతలు సౌందర్ రాజన్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. 

Related Post