ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై కల్వకుంట్ల కవిత స్పందించారు. “నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడే చెప్పాను... చివరికి న్యాయం ధర్మం గెలుస్తుందని చెప్పాను. కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తానని చెప్పాను! ఇప్పుడు అదే జరిగింది.
నన్ను ఈ కేసులో ఇరికించి జైల్లో పెట్టినప్పుడు నాగురించి నోటికి వచ్చినట్లు మాట్లాడిన వారందరికీ ఈ తేర్పు చెంపదెబ్బ వంటిదేనని భావిస్తున్నాను.
భారతీయ న్యాయవ్యవస్థపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది. ఈ కేసులో నాకు క్లీన్ చిట్ ఇచ్చి విముక్తి ప్రసాదించినందుకు న్యాయవ్యవస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
బిగ్ టీవీతో కల్వకుంట్ల కవిత
నేను ఏ తప్పు చేయలేదు
కడిగిన ముత్యంలా వస్తానని చెప్పాను.. వచ్చాను
న్యాయ వ్యవస్థపై నాకున్న నమ్మకాన్ని ఈ తీర్పు నిజం చేసింది
నాపై నోరు జారినవారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది
- కల్వకుంట్ల కవిత
I did nothing wrong.. This verdict is like a slap in… https://t.co/audh4s6Rfo pic.twitter.com/YLtGzH475w