తెలంగాణలో రెండు జిల్లాలలో భూకంపం

February 26, 2026
img

తెలంగాణలో మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో బుధవారం అర్దరాత్రి స్వల్పంగా భూమి కొన్ని సెకన్లపాటు పించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9 నమోదయింది. మంచిర్యాలకు జిల్లా కేంద్రానికి 35 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌ మండలం మర్తిడి గ్రామంలో సుమారు మూడు సెకన్ల పాటు భూమి కంపించగా ఇళ్ళలో పైన పెట్టిన వస్తువులు కింద పడటంతో గ్రామస్తులు మేల్కొని భయంతో బయటకు పరుగులు తీశారు. చాలాసేపు బయటే కాలక్షేపం చేశారు. మళ్ళీ భూప్రకంపనలు రాకపోవడంతో తెల్లవారుజామున అందరూ తిరిగి ఇళ్ళలోకి వెళ్ళారు. తెలంగాణ-మహారాష్ట్ర  సరిహద్దు గ్రామాలలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. 

Related Post