ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌కు సమీపంలో మంగళగౌరి బట్టల దుకాణం ఉంది. దాని ఆవరణ అందంగా అలంకరించేందుకు వెదురు బద్దలు, గుడ్డతో తయారుచేసిన ఓ గోపురం ఏర్పాటు చేశారు. దానికే మంటలు అంటుకొని భవనంలోకి వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ అగ్నిప్రమాదంలో కొంత ఆస్తి నష్టం తప్ప ఎవరూ గాయపడలేదు, గోపురం డెకరేషన్ కోసం లోపల లైట్లు ఏర్పాటు చేశారు. వాటి వైరింగులో షార్ట్ సర్క్యూట్ అవడంతో వెంటనే మంటలు అంటుకొని వ్యాపించినట్లు ప్రాధమిక సమాచారం.