దక్షిణ మద్య రైల్వే డోర్‌-టూ- డోర్‌ పార్సిల్ సేవలు త్వరలో

February 24, 2026
img

దక్షిణ మద్య రైల్వే విభాగం డోర్‌-టూ- డోర్‌ పార్సిల్ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. దీని కోసం సేవల నిర్వహణ, రవాణా, మార్కెట్, ఆర్దిక,సాంకేతిక, వాణిజ్య అంశాలపై అధ్యయనం చేసి తగు సిఫార్సులు చేసేందుకు బెంగళూరు ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది. త్వరలో ‘రైల్ పార్సిల్ యాప్’ ప్రారంభించబోతోంది.

ముందుగా హైదరాబాద్‌ నగర పరిధిలో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభిస్తుంది. దీనిలో రైల్వే సిబ్బంది ఇంటికే వచ్చి పార్సిల్ తెచ్చి ఇస్తారు.  తీసుకు వెళతారు. కనుక దీనికి మంచి స్పందన ఉంటుందని దక్షిణ మద్య రైల్వే అధికారులు నమ్మకంగా ఉన్నారు.

హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టులో ఏవైనా లోటుపాట్లు గమనిస్తే సరిదిద్దుకొని, విజయవంతమైన తర్వాత  క్రమంగా దక్షిణ మద్య రైల్వే పరిధిలో అన్ని రాష్ట్రాలు, నగరాలూ, పట్టణాలకు ఈ సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.

దక్షిణ మద్య రైల్వేలో ఇప్పటికే పార్సిల్ సర్వీసు సమర్ధంగా నిర్వహిస్తోంది. కనుక దానికి కొనసాగింపుగా ఇప్పుడు డోర్‌-టూ- డోర్‌ పార్సిల్ సేవలు ప్రారంభిస్తే సులువుగానే నిర్వహించవచ్చని దక్షిణ మద్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Related Post