ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్, మణికొండలోని చిత్రపురిలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించినప్పటికీ 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం కన్నుమూశారు.
గత మూడేళ్ళుగా ఆమె అఖిల్ రెడ్డి అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. కానీ వారి మద్య మనస్పర్ధలు రావడంతో ఏడాది క్రితం బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అప్పటి నుంచే కోమలి తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారని సమాచారం. కానీ విడిపోయిన ఏడాది తర్వాత ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె చావుకి వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు.