నేడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. తన పేరుతో కొందరు వ్యక్తులు చేస్తున్న కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన ఏర్పాటుకు తాను అనుమతించలేదని, అలాంటి ప్రయత్నాలను తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా తనపై అభిమానం ఉంటే బీఆర్ఎస్ పార్టీలో చేరి కలిసి పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి నాయకుల దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఖండించడం అవసరం. లేకుంటే వారి అనుచరులమని చెప్పుకుంటూ ప్రజలు, వ్యాపార సంస్థల నుంచి మోసగాళ్ళు డబ్బు దండుకునే ప్రమాదం ఉంటుంది.