గాంధీ సరోవర్: ఆందోళన వద్దు బల్మూరి వెంకట్

February 22, 2026


img

కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టబోతోంది. దీని కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అయితే ఆ ప్రాంతంలో చాలా ఏళ్ళ క్రితమే నిర్మించిన అనేక నివాస సముదాయాలు (అపార్ట్‌మెంట్‌లు) ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ తొలగించి అక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీ

నిపై ఆ ప్రాంతవాసులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏళ్ళ తరబడి ఈఎంలు చెల్లించి ఎట్టకేలకు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే, ప్రభుత్వం ఒక్క జీవోతో తమని రోడ్డున పడేస్తోందని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని కోసమేనా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది? అని నిలదీస్తున్నారు. 

ఇళ్ళు కోల్పోతున్న నిర్వాసితులను కలిసి వారికి ధైర్యం చెప్పి నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్‌ నేతల స్పందన అనూహ్యంగా ఉంది. బీఆర్ఎస్‌ పార్టీ ఈ ప్రాజెక్టుకు అడ్డుపడెందుకే వారిని రెచ్చగొడుతోందని ఆరోపిస్తున్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, “దశాబ్దాలుగా మూసీ నది మురికి నీటితో స్థానిక ప్రజలు నానా బాధలు పడుతున్నారు. కనుక వారికి ఉపశమనం కలిగించేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబోతే, అది పూర్తిచేస్తే ఆయనకు మంచి పేరు వస్తుందనే బీఆర్ఎస్‌ పార్టీ అడ్డుపుల్లలు వేస్తోంది. కానీ నిర్వాసితులలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 


Related Post