చంచల్ గూడ జైలులో ఉగ్రకుట్రలు... ఒట్టి పుకార్లే

February 21, 2026


img

మీడియా, సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు పనిగట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిని ఖండిస్తూనే ఉంటుంది. అయినా పుకార్లు ఆగడం లేదు. మొన్న కలెక్టర్ కార్యాలయాలలో బతుకమ్మ విగ్రహాల ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టాయి. 

కానీ వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోంది. ఆ పుకార్లను ఖండించడానికి నిధులు విడుదలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. 

ఆ పుకార్లు సద్దు మణిగక మునుపే చంచల్ గూడ జైలులో కొందరు ఉగ్రవాదులు ములాఖాత్ సమయంలో దేశంలో బాంబు ప్రేలుళ్ళకు  కుట్రలు జరుపుతున్నారంటూ మరో కొత్త పుకారు మొదలైపోయింది. దానిపై డిఐజీ శ్రీనివాస్‌ స్పందిస్తూ, “ఉగ్ర కుట్ర ఒట్టి పుకారు మాత్రమే. జాతీయ భద్రతకు సంబంధించి ఇలాంటి వార్తలు ప్రసారం చేసే ముందు మీడియా సంస్థలు సంబందిత  అధికారులతో ధృవీకరించుకోవడం మంచిది. 

చంచల్ గూడ జైలులో లష్కరే తోయిబాకు చెందిన ఒకే ఒక ఉగ్రవాది ఉన్నాడు. అతని కదలికలపై నిరంతరంగా నిఘా ఉంటుంది. ములాఖాత్ కూడా అతనికి వేరేగా ఉంటుంది. అతనిని కలిసేందుకు భార్య మాత్రమే వస్తుంది. వేరెవరూ రారు. ములాఖాత్ సమయంలో కూడా అతనిపై నిఘా ఉంటుంది. కనుక అతనుదాడులకు కుట్ర చేసే అవకాశమే లేదు,” అని డిఐజీ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. 


Related Post