ఫ్యామిలీస్, చిన్న పిల్లలు కల్ట్ చూడొద్దు: విశ్వక్ సేన్

February 21, 2026


img

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ కధ, దర్శకత్వంలో వస్తున్న #కల్ట్ టీజర్‌ లాంచింగ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసిఎక్స్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఫ్యామిలీస్, చిన్న పిల్లలు, అలాగే బలహీనమైన గుండె ఉన్నవారు  కల్ట్ సినిమా చూసేందుకు రావద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ సినిమాలో అలాంటి సరుకు (మాదకద్రవ్యాలు, బూతులు, రక్తపాతం వగైరా) ఉంది,” అని అన్నారు.

ఇవన్నీ ఉంటాయని విశ్వక్ సేన్ ముందే చెప్పేశారు కనుక ఎవరూ ఆగిపోరు. అవన్నీ ఉన్నాయంటే వాటి కోసమే వచ్చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కనుక ఇదీ ఓ రకమైన సినిమా ప్రమోషన్ అనే భావించవచ్చు.  

ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ కొంతమంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఇటీవల వియత్నాంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా నేను ఈ కధ తయారు చేశానని విశ్వక్ సేన్ చెప్పారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా తీస్తాము,” అని చెప్పారు. 

ఈ సినిమాకు కధ విశ్వక్‌ సేన్‌, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, ఆర్ట్: అరవింద్ మూలే,  చేస్తారు. తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై #కల్ట్ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష