మార్చి మొదటి వారంలో వృషకర్మ ఫస్ట్ గ్లిమ్స్‌

February 20, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్ హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది కనుక మార్చి మొదటి వారంలో ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 ‘వృషకర్మ’ అంటే కార్యసాధకుడు అని అర్ధం అని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. ఓ దట్టమైన అడవిలో నిధి కోసం సాగే సాహసోపేతమైన అన్వేషణ ఈ సినిమా కధ. దీనిలో మీనాక్షి చౌదరి ‘ఆర్కియాలజిస్ట్’ గా నటిస్తున్నారు. యువ హిందీ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్)ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ వేసవిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష