సంధ్య థియేటర్ కేసులో మరో ట్విస్ట్

February 20, 2026
img

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమా స్పెషల్ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నేడు మరో ట్విస్ట్ ఏర్పడింది. ఈ కేసులో అల్లు అర్జున్‌తో సహా మొత్తం 23 మందిపై పోలీసులు నేడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఇది మొదటిసారి కాదు రెండోసారి. సరైన సాక్ష్యాధారాలు జత చేయకుండాఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ మొదటిసారి న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

అయితే నేడు రెండోసారి దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఈ కేసుకి సంబంధించి సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో కూడిన హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ వగైరా జత పరచనందుకు మరోసారి తిరస్కరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

సంధ్య థియేటర్ త్రొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె 11 ఏళ్ళ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండేళ్ళుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వైద్య ఖర్చులకు అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ ఇద్దరూ భారీగా నష్టపరిహారం చెల్లించారు. అయితే ఒకరి మృతికి మరొకరి జీవితం తలక్రిందులు అవడానికి అల్లు అర్జున్‌ కూడా కారకుడేనని పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్‌ దాఖలు చేశారు.

Related Post