రేపిస్ట్ శవాన్ని డంపింగ్ యార్డులో పూడ్చివేత

February 20, 2026
img

ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లి పట్టణంలో కులవర్ధన్‌ అనే యువకుడు ఇటీవల ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారం, హత్య చేశాడు. తర్వాత పాప మృతదేహాన్ని ఇంట్లో ఉన్న నీళ్ళ డ్రమ్ములో కుక్కి, మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు.

ఈ కేసులో అతనిని అరెస్ట్ చేసి తీసుకువెళుతుండగా తప్పించుకొని పారిపోయాడని, స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. పోస్టు మార్టం తర్వాత అతని శవాన్ని తీసుకునేందుకు తల్లితో సహా ఎవరూ ముందుకు రాలేదు.

కనుక పోలీసుల సూచన మేరకు మదనపల్లి మున్సిపల్ సిబ్బంది చెత్త తరలించే వాహనంలో అతని శవాన్ని స్థానిక డంపింగ్ యార్డుకు తరలించారు. అక్కడే పోలీసుల సమక్షంలో గొయ్యి తీసి పాతి పెట్టారు.

ఈ పరిణామాలపై బాలిక తల్లితో పాటు మదనపల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు చేసే ప్రతీ ఒక్కరికీ ఇలాంటి ముగింపే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Related Post