జిహెచ్‌ఎంసి విభజనపై హైకోర్టులో పిటిషన్‌

February 19, 2026


img

తెలంగాణ ప్రభుత్వం జిహెచ్‌ఎంసిని మూడు కార్పోరేషన్లుగా విభజిస్తూ ఇటీవల ఉత్తర్వులు (జీవో 55) జారీ చేసింది. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువా రెడ్డి అనే స్థానిక వ్యాపారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కేంద్ర ప్రభుత్వం 2027లో జనగణన చేపట్టేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

కనుక అది పూర్తికాకుండా పాత జనాభా లెక్కల ప్రకారం జిహెచ్‌ఎంసిని విభజిస్తే తర్వాత అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని పిటిషనర్ పేర్కొన్నారు. కనుక జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కూడా ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. 

కనుక జనగణన పూర్తయ్యే వరకు జిహెచ్‌ఎంసి విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే విధించాలని పిటిషనర్ కోరారు. 

ఈ పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ      రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిండి. ఈ కేసు తదుపరి విచారణని మూడు వారాలకు వాయిదా వేసింది. 

ఒకవేళ హైకోర్టు స్టే విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియని నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల సంఘం ప్రస్తుతం ఉన్న జిహెచ్‌ఎంసి-150 డివిజన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.   


Related Post