మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మంచి నటుడు, రచయిత, దర్శకుడు కూడా. 2019లో విడుదలైన ఫలక్‌నూమా దాస్ సినిమాకు విశ్వక్ సేన్ కధ, దర్శకత్వం, సహ నిర్మాత కూడా. మళ్ళీ 2023లో విడుదలైన ‘దాస్ కా దమ్కీ’ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం చేశారు. ఇప్పుడు #కల్ట్ అనే మరో సినిమాకు కధ, దర్శకత్వం చేస్తున్నారు.
గత ఏడాది నవంబరులో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అప్పుడే టీజర్ వరకు వచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసిఎక్స్ స్క్రీన్‌లో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగబోతోందని విశ్వక్ సేన్ స్వయంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ అభిమానులతో పంచుకున్నారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు. కొంతమంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఇటీవల వియత్నాంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా నేను ఈ కధ తయారు చేశానని విశ్వక్ సేన్ చెప్పారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా తీస్తాము,” అని చెప్పారు.
ఈ సినిమాకు కధ విశ్వక్ సేన్, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, ఆర్ట్: అరవింద్ మూలే, చేస్తారు. తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై #కల్ట్ సినిమా నిర్మిస్తున్నారు.