రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ కలిసి రూపొందుతున్న ‘వారణాశి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత అందరూ జార్జియాకు బయలుదేరబోతున్నారు.
మొదట అంటార్కిటికాలో షెడ్యూల్ అనుకున్నప్పటికీ, ప్లాన్ మార్చుకొని ముందు జార్జియా బయలుదేరుతున్నారు. అక్కడ షూటింగ్ ముగిసిన తర్వాత ఏపిల్-మే నెలల్లో అంటార్కిటికా వెళ్ళే అవకాశం ఉంది.
వారణాశిలో బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా, ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.