అదుర్స్-2 స్క్రిప్ట్ రెడీ... ఎన్టీఆర్‌దే ఆలస్యం: కోన వెంకట్

February 15, 2026


img

జూ.ఎన్టీఆర్‌ కెరీర్‌లో అనేక సూపర్ హిట్లున్నాయి. వాటిలో ‘అదుర్స్’ ఒకటి. సూపర్ డూపర్ అయిన ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అలాంటి సినిమాకి సీక్వెల్ చేసి సరిగ్గా కుదరకపోతే బాధపడటం దేనికని అదుర్స్ టీమ్‌ చాలా కాలంగా అలాంటి ఆలోచన చేయలేదు.

కానీ ‘అదుర్స్’కి కధ, స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ మాత్రం సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో చెప్పారు. అదుర్స్ దర్శకుడు వివి వినాయక్ కూడా సీక్వెల్‌పై ఆసక్తిగానే ఉన్నారని చెప్పారు. కానీ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నందున, అయనకు ఖాళీ దొరికితే కధ చెప్పి ఒకే అనిపించుకుందామని ఎదురుచూస్తున్నామని కోన వెంకట్ చెప్పారు. 

‘అదుర్స్’లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. దానిలో బ్రాహ్మణ యువకుడుగా అద్భుతంగా నటించారు. ఆయన భాష, యాస, గెటప్, అమాయకంగా, పిరికివాడిగా మాట్లాడుతూ చేసిన కామెడీ కడుపుబ్బనవ్విస్తాయి.

అలాగే బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి, నయనతార, రమాప్రభ, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, నాజర్, మహేష్ మంజ్రేకర్ తదితరుల నటన, కామెడీతో ప్రేక్షకులను మైమరపించారు. మరి సీక్వెల్ చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటారో లేదో? ఒప్పుకుంటే ఎప్పుడు మొదలుపెడతారో? చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష