మున్సిపల్ ఫలితాలలో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 116లో 64 మున్సిపాలిటీలను దక్కించుకొని విజయ ఢంకా మోగించింది. మొత్తం 2,582 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 1,347 వార్డులు దక్కించుకోగా, బీఆర్ఎస్ పార్టీ 13 మున్సిపాలిటీలు, 717 వార్డులు గెలుచుకుంది.
బిజేపి 261, స్వతంత్ర అభ్యర్ధులు 256 వార్డులు గెలుచుకున్నారు. 38 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10కి 8 సీట్లు గెలుచుకుంది.
ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, రామగుండం, నల్గొండలో విజయం సాధించింది. కొత్తగూడెం కార్పోరేషన్ లో 60 డివిజన్లు ఉండగా వాటిలో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 8, బిజేపి, సీపీఏం, చెరో సీటు, ఇతరులు 6 సీట్లు గెలుచుకున్నారు.
కాంగ్రెస్, వామ పక్షాల మద్య దోస్తీ ఉంది కనుక రెండూ చేతులు కలిపే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. కనుక ఈ సస్పెన్స్ 16న క్లియర్ అవుతుంది.
కార్పోరేషన్ ఫలితాలు
రామగుండం (60/60) కాంగ్రెస్: 38, బీఆర్ఎస్:13 , బిజేపి: 1, ఇతరులు: 8.
నిజామాబాద్ (59/60) కాంగ్రెస్: 17, బీఆర్ఎస్: 1, బిజేపి: 38, ఇతరులు: 14.
మహబూబ్‌నగర్ (43/60) కాంగ్రెస్:24, బీఆర్ఎస్: 10 , బిజేపి: 6, ఇతరులు: 4.
మంచిర్యాల (60/60) కాంగ్రెస్: 44, బీఆర్ఎస్: 8 , బిజేపి: 5 , ఇతరులు: 3.
కరీంనగర్ (65/66) కాంగ్రెస్: 14, బీఆర్ఎస్: 9 , బిజేపి: 30, ఇతరులు: 12.
నల్గొండ (48/48) కాంగ్రెస్: 27, బీఆర్ఎస్: 9, బిజేపి: 4, ఇతరులు: 8.
కొత్తగూడెం (60/60) కాంగ్రెస్: 22 , బీఆర్ఎస్: 8 , బిజేపి: 1, ఇతరులు: 29.