ఊహించినట్లే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఈ గెలుపోటములపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన కూడా ఊహించినట్లే ఉంది.
ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడలేకపోయింది. అందువల్లే ప్రజలు కాంగ్రెస్‌కి వేశారు తప్ప కాంగ్రెస్ పాలన మెచ్చి కాదు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం లభించింది. కానీ దానిని అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. అందువల్లే ప్రజలు కాంగ్రెస్‌కే ఓట్లు వేశారు.
నేను రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీలో కొందరు కారు కూతలు కూస్తున్నారు. వారికి నే చెప్పేదేమిటంటే నోరు అదుపులో పెట్టుకోమని. ఇప్పటికైనా పద్దతులు మార్చుకుంటే మంచిది. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే పిక్చర్ బాకీ హై’ అని బీఆర్ఎస్ పార్టీలో అందరూ గుర్తుపెట్టుకోండి.
మేము ఇంకా రాజకీయపార్టీ ఏర్పాటు చేసుకోలేదు కనుక మున్సిపల్ ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జెండాపై పోటీ చేశాము. తొలి ప్రయత్నంలోనే వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాము. మరో 40 వార్డులలో మావాళ్ళకు మంచి స్పందన వచ్చింది. మా ఈ తొలి ప్రయత్నంలోనే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించారు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది
కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పోల్చుకుంటుంది. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయ్యారు
ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్… pic.twitter.com/GSxZPlUEE1