రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’తో అయ్యప్పదీక్షకు సిద్ధం అవుతున్నారు. మాస్ మహారాజ్ అనిపించుకుంటున్న రవితేజ తన 77వ సినిమాకి ఇలాంటి టైటిల్, ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఒకే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరుముడి-అయ్యప్పదీక్షలో ఏమాత్రం అతి, పొరపాటు చేసినా సినిమాకి నెగెటివ్ క్యాంపెయినింగ్ మొదలైపోతుంది.
ఈ సినిమా టైటిల్ రిలీజ్ పోస్టర్లో రవితేజ అయ్యప్పదీక్ష దుస్తులలో నెత్తిపై ఇరుముడి మూట పెట్టుకొని, ఓ పాపని ఎత్తుకొని ఉండగా చుట్టూ అయ్యప్పస్వాముల వాయిద్యాలు వాయిస్తున్నట్లు చూపారు. ఈ సినిమాలో కావేరీగా నటిస్తున్న హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పోస్టర్ విడుదల చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.