నేడు ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్స్ డే) సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే గ్రీటింగ్స్ చెప్పారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ మూడు పార్టీలు మళ్ళీ ప్రేమలో పడ్డాయి. కనుక వాలంటైన్స్ డే సందర్భంగా వాటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిజామాబాద్ మేయర్ పదవి దక్కించుకోవడానికి ఆ మూడు పార్టీ అక్రమ సంబంధం పెట్టుకున్నాయి. కనుక ప్రజలు చీత్కరిస్తున్నా, అసహ్యించుకుంటున్నా పట్టించుకోకుండా ఆ మూడు పార్టీల అక్రమ సంబంధం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను,” అని బండి సంజయ్ అన్నారు.
నిజామాబాద్ కార్పోరేషన్లో 60 సీట్లున్నాయి. వాటిలో బిజేపి అత్యధికంగా 28 గెలుచుకోగా, కాంగ్రెస్: 17, మజ్లీస్: 14, బీఆర్ఎస్: 1 సీటు గెలుచుకున్నాయి. మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 31 సీట్లు అవసరం.
బిజేపికి ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య కలిపి నాలుగు ఓట్లున్నాయి. కనుక వారి ఓట్లతో కలిపితే బిజేపికి 32 ఓట్లు ఉన్నాయి.
కానీ కాంగ్రెస్ (17), మజ్లీస్ (14), బీఆర్ఎస్ (1) కలిపితే వారి కూటమికి 32 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక ఇద్దరు ఎమ్మెల్యేలు (పీసీసీ అధ్యక్షుడు) మహేష్ కుమార్ గౌడ్, భూపతి రెడ్డి ఓట్లున్నాయి. కనుక కూటమికి 34 ఓట్లు అవుతాయి. అందుకే బండి సంజయ్ వాటికి వాలంటైన్ గ్రీటింగ్స్ చెప్పారు.
కాంగ్రెస్ - బీఆర్ఎస్ - ఎంఐఎంకి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
- కేంద్రమంత్రి బండి సంజయ్ pic.twitter.com/Bjs6zkOIbH