వనజీవి రామయ్య... బయోపిక్

February 15, 2026


img

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ వనజీవి రామయ్య జీవితగాధ ఆధారంగా ‘వనజీవి రామయ్య’ పేరుతో ఓ బయో పిక్ రూపొందుతోంది. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ వనజీవి రామయ్యగా నటిస్తున్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

బీఆర్ మూవీస్, ప్రకృతి పరిరక్షణ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ: డాక్టర్ కళారంగా, దర్శకత్వం: వేముగంటి, సంగీతం: బల్లేపల్లి మోహన్, కెమెరా: తోట రమణ, డైలాగ్స్: వివా రెడ్డి, ఎడిటింగ్: దాము చేస్తున్నారు.       



Related Post

సినిమా స‌మీక్ష