తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మంత్రులలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఇటీవల సింగరేణి నైనీ బ్లాక్ 1600 కోట్ల టెండర్ల విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. దీని కోసం ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోటీ పడ్డారని ఏబీఎన్ బయటపెట్టింది. దీనిపై రచ్చరచ్చవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ టెండర్లు రద్దు చేసింది.
అవినీతి జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేశారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పేలోగానే మున్సిపల్ ఎన్నికల హడావుడిలో మునిగిపోయింది. కనుక ఇప్పుడా వ్యవహారం, వివాదం పూర్తిగా సద్దు మణిగాయి.
కానీ ఇటీవల ఓ ట్యూబ్ ఛానల్ ప్రతినిధితో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నివాసంలోనే బ్రేక్ ఫాస్ట్ భేటీ అయినప్పుడు మరో బాంబు పేల్చారు.
సింగరేణికి చెందిన నైనీ బ్లాక్‌లో నేను జోక్యం చేసుకోవడం వల్లనే 30,000 కోట్ల కుంభకోణం బయటపడింది. నిలిచిపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుగాజేసుకోకపోయి ఉంటే అన్నివేళ కోట్లు ఎవరి జేబులోకో వెళ్ళిపోయేవే కదా? కానీ నేను అడ్డుపడటంతో అంత సొమ్ము ప్రభుత్వానికి ఆదా అయ్యిందని జనం అనుకుంటున్నారు,” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఈ వివాదం బయటకు పొక్కిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సింగరేణిలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరుగలేదు. రెండు మీడియా సంస్థల మద్య జరిగిన యుద్ధంలో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. అవి నిజం కావు,” అని అన్నారు.
మరో విషయం ఏమిటంటే, నైనీ బ్లాక్ గనుల టెండర్ విలువ రూ.1,600 కోట్లు అని వార్తలు వచ్చాయి. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా రూ.30 వేల కోట్లు అని చెపుతున్నారు కదా? దీనిపై సిఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో?
నా వల్లే 30 వేల కోట్ల నైనీ బొగ్గు స్కాం బైట పడింది!
సింగరేణి బొగ్గు స్కాంపై తలోమాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి
బొగ్గు స్కాం జరగలేదని, అది కేవలం ప్రతిపక్షాల ప్రచారం మాత్రమేనని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి
తన వల్లే స్కాం బయటపడిందని, దానితో ప్రభుత్వానికి… https://t.co/y4nipnNGoy pic.twitter.com/PpKAJKF6xT
(Video Courtesy: STV)