ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో జాగృతి సభ్యులు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 సీట్లు ఉండగా వాటిలో 8 సీట్లు ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్ధులు గెలుచుకున్నారు. మిగిలిన రెండూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుచుకున్నాయి.
అయితే కౌన్సిలర్‌గా గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “తమకూ తెలంగాణ జాగృతికి ఎటువంటి సంబందమూ లేదని ప్రకటించి మొదటి షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి గెలిచిన 8 మంది కౌన్సిలర్లు సిఎం రేవంత్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి తాము కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగాలనుకుంటున్నామని చెప్పడం కల్వకుంట్ల కవితకు మరో పెద్ద షాకే. కనుక వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు హస్తగతం అయ్యింది.