తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, బిజేపి నిజామాబాద్, కరీంనగర్ కార్పోరేషన్లలో అత్యధిక స్థానాలు దక్కించుకుంది. కార్పోరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి పట్టు కోల్పోయిందని ఈ ఎన్నికలతో స్పష్టమైంది.
116 పురపాలక సంఘాలలో కాంగ్రెస్: 66, బీఆర్ఎస్: 13, బిజేపి: 0, ఫార్వార్డ్ బ్లాక్:1 గెలుచుకున్నాయి. మిగిలిన 36 చోట్ల హంగ్ ఏర్పడింది. వాటిలో కూడా 14 సంఘాలను దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడే పావులు కదుపుతోంది. దాని ప్రయత్నాలు ఫలిస్తే మొత్తం 88 పురపాలక సంఘాలు దాని వశమవుతాయి.