చేసే వృత్తి చిన్నదైనా దానిని గౌరవించడం అవసరం. కాదని పగటి కలలు కంటే ఏమవుతుందో తెలిపే చిక్కటి ఇరానీ చాయ్ వంటి ‘నవాబ్ కేఫ్’ (చాయ్ వాలా) కధతో మన ముందుకు వస్తున్నారు కందూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని. ఈ నెల 20న నవాబ్ కేఫ్ విడుదల కాబోతోంది. కనుక నేడు ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రమోద్ హర్ష, స్క్రీన్ ప్లే: ఇమ్రాన్ సిద్దికీ, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారీ, కెమెరా: క్రాంతి వర్ల, ఎడిటింగ్: పవన్ నరవ చేశారు.
హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధ వి పప్పుడిప్పు ఈ సినిమా నిర్మించారు.