చిన్న దర్శకుడుగా ఉన్న మారుతికి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరో లభిస్తే ‘రాజాసాబ్’ అంటూ హడావుడి చేసి నిలువునా ముంచేశారు. దాంతో ప్రభాస్ అభిమానులు ఆయనతో ఓ ఆటాడుకున్నారు. ప్రభాస్ ఇప్పటికే స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇప్పుడు మారుతి కూడా ఆ షాక్ నుంచి తేరుకున్నట్లే ఉన్నారు. ఇటీవల అయన ఓ కొత్త సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. దాని పేరు ‘హ్యాపీ పొంగల్.’ అంటే వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లే. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో,హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతక నిపుణుల పేర్లు ప్రకటించబోతున్నారు.
ఇక నితిన్ నటించబోతున్న సినిమాకి సంక్రాంతి శుభాకాంక్షలు అని పేరు ఖరారు చేశారు. అంటే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి పండగకి విడుదల కాబోతోందన్న మాట!
అయితే నితిన్ రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒక దానికి విక్రమ్ దర్శకుడు కాగా రెండో సినిమాకి విఐ ఆనంద్ దర్శకుడు. వాటిలో ఒకటి గుర్రపు స్వారీ కధాంశంతో తీస్తుండగా మరొకటి యాక్షన్ మూవీ. కనుక ఈ రెండు సినిమాలకు ఆ టైటిల్ నప్పుడు. కనుక నితిన్ మూడో సినిమా మొదలుపెట్టి ఉండవచ్చు.