ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఉంది. దానిపై అనేక సినిమాలు తీశారు. ఇప్పుడు ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో మరో కొత్త సినీ పరిశ్రమ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.1గా ‘మార్కండేయ’ని సిద్ధం చేశారు.
శిష్ట్ల విఎంకె దర్శకత్వంలో విక్రాంత్ రెడ్డి హీరోగా రూపొందిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా టైటిల్ గ్లిమ్స్ నిన్న లాంచింగ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.
ఈ సినిమాకు సంగీతం: హరి ఎస్ఆర్, కెమెరా:జగదీష్ వర్మ భూపతిరాజు, డైలాగ్స్: కళ్యాణ్ రాఘవ్, ఎడిటింగ్:ఫణీంద్ర నలగండ్ల, ఆర్ట్: రాంప్రసాద్, వీఎఫ్ఎక్స్: ప్రదీప్ పూడి చేస్తున్నారు.