బీఆర్ఎస్‌ పార్టీకి ఆ 13 మున్సిపాలిటీలలో సింగిల్ డిజిట్!

February 13, 2026


img

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందని, కనుక ప్రభుత్వం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీష్‌ రావు పదేపదే చెపుతుంటారు.

కనుక మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పి ఉండాలి. కానీ బీఆర్ఎస్‌ పార్టీకే చెప్పారు. మొత్తం 116 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్‌ పార్టీ కేవలం 13 మాత్రమే గెలుచుకుంది. ఇక 13 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్‌ పార్టీ సింగిల్ డిజిట్‌కి పరిమితం అవడం తలకొట్టేసినట్లే. 

యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి, వడ్డేపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, నందికొండ, మంథని, మధిర, కొడంగల్, హాలియా, చొప్పదండి, భూత్పూర్, ఆత్మకూరు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్‌ పార్టీ ఒక్కో వార్డులో మాత్రమే గెలిచింది.

పదేళ్ళపాటు రాష్ట్రంలో తిరుగులేదన్నట్లు రాజకీయాలను, పార్టీలను శాశించిన బీఆర్ఎస్‌ పార్టీ నేడు ఈ దుస్థితిలో ఉండటం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుంటే వారికే మంచిది.  


Related Post