ది ప్యారడైజ్ రిలీజ్ అప్పుడేనట!

February 12, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ శంషాబాద్ వద్ద ప్రత్యేకంగా సెట్స్ వేయడంలో చాలా ఆలస్యం అవడం, మరికొన్ని ఇతర కారణాల వలన షూటింగ్ మద్యలో గ్యాప్ వచ్చింది.

ఇప్పుడు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కనుక ఈ వేసవిలో తప్పకుండా విడుదలవుతుందని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్‌కి తాము తొందరపడటం లేదంటూ ట్వీట్ చేస్తూ ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని తెలియజేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. కానీ ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్తే సినిమా దెబ్బ తినే ప్రమాదమే ఎక్కువుంటుంది. కనుక మరోసారి వాయిదా వేయకుండా తప్పనిసరిగా ఆగస్ట్ 21న విడుదల చేయడం చాలా అవసరం. 

 ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నాని ఇంట్రడక్షన్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహార్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష