గోపీ అట్చర దర్శకత్వం సుహాస్, శివానీ నగరం, నరేష్ ప్రధాన పాత్రలు చేసిన ‘హే భగవాన్’ టీజర్‌తోనే చాలా బిజినెస్ చేసేశారు. నేడు ట్రైలర్ విడుదల చేస్తే దానిలో కూడా తండ్రీ కొడుకులుగా నటిస్తున్న నరేష్, సుహాస్ ఇంకా చాలా బిజినెస్ చేసేశారు.
ఇంతకీ వారు చేసిన ఆ బిజినెస్ ఏమిటా? ఆ సీక్రెట్ ఎవరికీ తెలియకూడదట! కనుక ఎవరికీ తెలియని ఆ బిజినెస్ గురించి ఆలోచిస్తూ అది చేసేందుకు సిద్ధమైన మన హీరోతో హీరోయిన్ ఎలా వేగుతుందో ‘హే భగవాన్’ అని తల పట్టుకోక తప్పదు.
ఈ సినిమాలో అన్నపూర్ణ, సుదర్శన్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సుహాస్ సూపర్ హిట్ సినిమా ‘రైటర్ పద్మభూషణ్’కు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకి కధ అందించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: మహిపాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, ఆర్ట్: ఏ రామ్ కుమార్ చేశారు.
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిభ్రవరి 20న విడుదల కాబోతోంది. అంతవరకు ఈ ఫ్యామిలీ బిజినెస్ ఏమిటో ఎవరికీ తెలీదు. తెలిసినా ఎవరికీ చెప్పకూడదు. అంతే!