పరిశ్రమలో నిర్మాతకి విలువ లేదు: దిల్ రాజు

February 18, 2026


img

ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, శ్రీ వెంకటేశ్వర సినీ పరిశ్రమ క్రియేషన్స్, దిల్ రాజు డ్రీమ్స్ సినీ నిర్మాణ సంస్థల అధినేత దిల్ రాజు, నేడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈరోజుల్లో సినీ పరిశ్రమలో నిర్మాతకు విలువలేదు.

నిర్మాత అంటే ఇచ్చేవాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా పుచ్చుకునేవాళ్ళే. కానీ ఆ పుచ్చుకునేవాళ్ళే నిర్మాతలని, సినీ పరిశ్రమని ఇప్పుడు శాశిస్తున్నారు. ఒకప్పుడు నిర్మాత అంటే సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పుచ్చుకునేవాళ్ళు ఎలా ఆడిస్తే మేము అలా ఆడాల్సిందే. లేకుంటే చాలా కష్టం,” అని అన్నారు. 

ఇది చాలా బాధాకరమైన స్టేట్‌మెంట్‌ కానీ వాస్తవమేనని సినీ పరిశ్రమలో ఉన్నవారికి, దాంతో సంబంధం ఉన్నవారికీ బాగా తెలుసు. సినిమా ఆడి లాభాలు వస్తే పర్వాలేదు. కానీ ఆడకపోతే ఒక్క నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే నష్టపోతారు. అయినా ఏమీ జరగనట్లు చిరునవ్వులు చిందిస్తూ మరో సినిమాకి సిద్ధం కాకతప్పదు.


Related Post

సినిమా స‌మీక్ష