ఇబ్రహీంపట్నం: చైర్మన్‌ నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌!

February 18, 2026


img

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేసింది. 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆకుల యాదగిరిని పోలీసులు హైకోర్టులో హాజరు పరిచారు. అతని వివరణ తీసుకున్న తర్వాత ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్‌ పదవుల ఎన్నికపై స్టే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 

చైర్మన్‌గా ఎన్నికైన టేకు సుదర్శన్ రెడ్డి నియామకంపై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని, దానిలో కలుగాజేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆకుల యాదగిరికి పోలీసులు రక్షణ కల్పించాలని, అతనిపై ఎవరూ ఒత్తిడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆదేశించింది.


Related Post